డెయిలీ డైట్‌లో సరైన పోషకాలు అందకపోతే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగలేరు. కాయగూరలు, పప్పుదినుసులతో పాటు డైట్‌లో పళ్లను తప్పకుండా చేర్చాలి. ప్రతి రోజూ పళ్ల ముక్కలు తినడం వల్ల శారీరక బలంతో పాటు మెదడు చురుకుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. స్కూల్‌కు వెళ్తుంటారు కాబట్టి.. తరచూ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు. ఆరెంజ్‌లో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. తరచూ ఆరెంజ్ తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఫైబర్, పొటాషియం, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.
- పిల్లలు జామపళ్లు ఎంతో ఇష్టంగా తింటారు. జలుబుకు మంచి విరుగుడుగా ఇది పనిచేస్తుంది. ఇందులో ఉండే కాపర్.. హార్మోన్ల ఉత్పత్తి క్రమపద్ధతిలో సాగేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉంచడంలో జామ మంచి పనితనం చూపిస్తుంది.
- పైనాపిల్ ఫ్లేవర్డ్ కేక్స్, ఐస్‌క్రీమ్‌లంటే పిల్లలకు ఎంతో ఇష్టం. పైనాపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సాఫీగా సాగేలా చూస్తాయి.
- రేగుపళ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇవి కణాల విచ్ఛిత్తిని అరికడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్‌తో పాటు విటమిన్-సి కూడా లభిస్తుంది.
0 Comments