How Quit Smoking with Meditation Techniques

ధ్యానంతో ధూమపానం దూరం ?

ధూమపానం మానాలంటే ఏం చేయాలి? చాలా కాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. పొగ తాగటం అలవాటు ఉన్న వారిని.. ఆ అలవాటు నుంచి దూరం చేయటానికి ఇప్పటికే మార్కెట్లో రకరకాల మందులు, ట్రీట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. 
కానీ వీటి వల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుంది తప్ప దీర్ఘకాలిక ఉపయోగం ఉండదు. దీని వెనకున్న కారణాలను వెతకటానికి టెక్సాస్‌ టెక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు. 

ఈ పరిశోధనలలో ధ్యానం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని తేలింది. ఈ పరిశోధనలో భాగంగా- ఒక వ్యక్తి తనను తాను ఎంత వరకూ నియంత్రించుకోగలడనే విషయాన్ని కనుగొనటానికి శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాలు చేశారు. సిగరెట్టు తాగాలనే ఆలోచన కలిగినప్పుడు మెదడులో కొన్ని భాగాలలో స్పందన కలుగుతుందని కనుగొన్నారు. 
క్రమం తప్పకుండా ధ్యానం చేసే వారిలో ఈ స్పందనలు చాలా నెమ్మదిగా ఉంటాయని తేలింది.

Post a Comment

0 Comments