How Your Sleep Affects Your Heart

 రాత్రి మేల్కొంటే రక్తపోటు?

రాత్రి నిద్ర కరువైతే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే! వాటితో పాటు రక్తపోటు కూడా రాత్రి సమయంలో ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయన్న విషయం అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. రాత్రి సమయంలో రక్తపోటు అధికం కావడం వలన ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

19 నుంచి 36 మంది మీద వీరు పరిశోధనలు నిర్వహించారు. రాత్రి సమయంలో వీరు నిద్రపోయే సమయాన్ని, ఆ సమయంలో వారి రక్తపోటునూ, నిద్రపోని సమయంలో వారి రక్తపోటును పరిశీలించారు. రాత్రి సమయంలో గాఢ నిద్ర పోయే వారిలో రక్తపోటు సాధారణ స్థితిలో ఉండగా, నిద్ర లేమితో బాధపడే వారిలో రక్తపోటు పెరుగుతూ ఉండడం వీరి దృష్టికి వచ్చింది. రాత్రి సమయంలో గాఢనిద్ర పోయే వారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమితో బాధపడేవారిలో అధికబరువు సమస్య ఎక్కువగా ఉండడాన్ని వీరు గమనించారు.

Post a Comment

0 Comments