డిప్రెషన్‌కి టాక్ థెరపీ..
నగరం అంటేనే ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రతి పనికి పరుగులు తీయాల్సిందే. దీంతో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డిప్రెషన్, యాంగ్జయిటీలకు లోనవుతున్నారు. అయితే ఈ అనారోగ్య సమస్యలను జబ్బులుగా పట్టించుకునే వారు మాత్రం చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.
వాటికి వైద్య చికిత్స కోసం డాక్టర్లను కలిసేవాళ్లయితే మరీ తక్కువమంది ఉన్నారు. ఒత్తిడికి, మానసిక సమస్యల పరిష్కారానికి టాక్ థెరపీని ఈమధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు. చాలాకాలం వరకూ టాక్ థెరపీని శా స్త్రీయమైన వైద్య చికిత్సగానే పరిగణించలేదు. అయితే ఇటీవల న్యూరోప్లాస్టిసిటీ మీద చేసిన ఒక స్టడీతో టాక్ థెరపీ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇంతకూ టాక్ థెరపీ అంటే ఏమిటి? మందులతో సంబంధంలేని విధానం ఇది. దీనిద్వారా మనస్తత్వ సంబంధమైన, ఉద్వేగాలకు సంబంధించిన, ప్రవర్తనాపరమైన అంశాలకు చెందిన సమస్యలకు చికిత్స చేస్తారు.
పేషంటుకు మెడికేషన్‌తోబాటు టాక్ థెరపీని కూడా అందిస్తారు. ఈ థెరపీ ద్వారా మనసు లోలోతుల్లో దాగున్న పలు సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. ఈ థెరపీ సహాయంతో మనలోపలి ప్రతికూల ఆలోచనాధోరణిని, భావాలను పోగొట్టవచ్చు. అంతేకాదు జీవితం పట్ల అనురక్తిని కలిగించడంతోపాటు పాజిటివ్ ఆలోచనా ధోరణిని పెంపొందించవచ్చు. జీవితంలో రకరకాల కష్టాలను ఎదుర్కొన్న వారికి ఈ థెరపీ ఎంతో ప్రయోజనకారి. అంతేకాదు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టాక్ థెరపీ ఎంతగానో సహాయపడుతుంది.
రిలేషన్‌షిప్స్ లో ‘టాకింగ్’కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది అనుబంధాలను పటిష్టంచేస్తుంది. అంతేకాదు మానసికంగా ఆరోగ్యంగా ఉండేట్లు సహకరిస్తుంది. ఇతరులు మన గురించి శ్రద్ధ తీసుకుంటారనే భావం డిప్రషన్‌కు గురయిన వారిలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. డిప్రషన్, ఈటింగ్ డిజార్డర్, యాంగ్జయిటీ, అడిక్షన్స్‌ను నిరోధించడానికి మందులతోపాటు టాక్ థెరపీని కూడా డాక్టర్లు అందిస్తారు. బైపోలార్, స్ర్కిజొఫ్రెనియాలను తగ్గించడానికి కూడా టాక్ థెరపీని వాడతారు.
జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను ఎదుర్కోవడంలో, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, ఆఫీసులో తోటి సిబ్బందితో తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో టాక్ థెరపీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారిలో డిప్రషన్ రిస్కు ఎక్కువగా ఉంటుంది. దీన్ని నివారించడంలో కూడా టాక్ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనారోగ్య తీవ్రతను బట్టి టాక్ థెరపీ ట్రీట్‌మెంట్ ఎంతకాలం ఇవ్వాలో నిశ్చయిస్తారు. టాక్ థెరపీనందించే వారిలో సైకాలజిస్టు, కౌన్సిలర్, సైక్రియాట్రిస్టు ఉంటారు. ఇందులో స్ర్టెస్, రిలేషన్‌షిప్ సమస్యలకు కౌన్సిలర్ సేవలందిస్తుంది.
ట్రామాలాంటి సీరియస్ అంశాలను సైకాలజిస్టు చూస్తుంది. పరిస్థితి సీరియ్‌సగా ఉండి మందులు, టాక్ థెరపీ రెండూ అవసరమైన వాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్లకి సైక్రియాట్రిస్టులు సేవలు అందిస్తారు.

0 Comments