Home Remedies for Blackheads On Face

నలుపు తగ్గడానికి...

బ్యూటిప్స్

ఒక చిన్న గిన్నెలోనాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, ఆ ఉండను కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిముషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. ఇలా రోజూ చేస్తుంటే కళ్లకింద వలయాలూ తగ్గుతాయి.
   
టీ స్పూన్ దోస రసం, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే మోచేతుల నలుపుదనం తగ్గుతుంది.
   
పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, వీపుకి పట్టించి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మెడ, వీపు భాగంలో నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది.


Post a Comment

0 Comments