How to Clean Brass with Natural Ingredients

ఇంటిటిప్స్

ఇత్తడి లోహం పూజా సామగ్రి, ఇంటి అలంకరణ వస్తువులలో ప్రధానమైనది. అయితే, ఈ వస్తువులు సరిగా శుభ్రపరచకపోతే నల్లబడటం కళ తప్పడం చూస్తుంటాం. ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవాలంటే... ఒక చిన్న పాత్రలో టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని క్లాత్‌కి అద్దుకుంటూ, ఇత్తడి పాత్రలపై రుద్దాలి. తర్వాత మరో పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడవాలి.

క్లాత్‌కి కొద్దిగా ఆలివ్ ఆయిల్ అద్దుకొని శుభ్రపరిచిన వస్తువులపై మృదువుగా తుడవాలి. దీంతో అవి కొత్తవాటిలా మెరుస్తాయి. నిమ్మకాయ (అర చెక్క), టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి. నిమ్మ చెక్కపై ఉప్పు వేసి నల్లబడిన ఇత్తడి వస్తువులపై రుద్ది, నీళ్లతో శుభ్రపరచాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్‌తో తుడవాలి. మురికి అంతా పోయి కొత్తవాటిలా మెరుస్తాయి.

Post a Comment

0 Comments